త్రివిక్రమ్ పై పూనం కౌర్ సంచలన ట్వీట్

జానీ మాస్టర్(Janny master) లైంగిక వేధింపుల కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఫిలింఛాంబర్ దీనిపై స్పందించింది. ఫిర్యాదుల బాక్స్ తో పాటు ప్రతి క్రాఫ్ట్ లో ప్యానెల్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో నటి పూనం కౌర్(Poonam kaur) దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) గురించి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.

పూనం కౌర్ ట్వీట్ చేస్తూ – దర్శకుడు త్రివిక్రమ్‌ని తెలుగు సినిమా పెద్దలు ప్రశ్నించాలి. గతంలో త్రివిక్రమ్ గురించి నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ లభించలేదు. దీని వల్ల నేను రాజకీయంగా కూడా ఒత్తిడి, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అని పేర్కొంది.

త్రివిక్రమ్ గురించి పూనం కౌర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ను పరోక్షంగా విమర్శిస్తోంది పూనమ్ కౌర్. త్రివిక్రమ్ గురించి కూడా గతంలో ఆరోపణలు చేసిందీ నటి.