రజినీ “కూలీ”లో బాలీవుడ్ స్టార్ హీరో

రజినీకాంత్(Rajnikanth) హీరోగా నటిస్తున్న కూలీ(Coolie) మూవీ గురించి రోజుకో ఎగ్జైటింగ్ అప్డేట్స్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున(Nagarjuna) విలన్ రోల్ లో నటిస్తుండగా..ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir khan) కూడా కూలీ టీమ్ లో జాయిన్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమిర్ ఖాన్ కూలీ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారట. దీంతో కూలీ సినిమా రేంజ్ మరింతగా పెరగనుంది. ఆమిర్ ఖాన్ ఉండటం వల్ల నార్త్ బెల్ట్ లో కూలీ సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.

లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ తర్వాత ఆమిర్ ఖాన్ సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. సుదీర్ఘకాలంగా వరుసగా సినిమాలు చేస్తూ రావడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోయానని, అందుకే కొంతకాలం విరామం తీసుకుని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తానని ఆమిర్ ఖాన్ ఆ మధ్య చెప్పాడు. రజినీ సినిమా కోసం అడగటం వల్ల కాదనలేక ఈ మూవీ ఒప్పుకున్నట్లు ఉన్నాడు ఆమిర్. సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్(Lokesh kanakaraj) కూలీ సినిమాను రూపొందిస్తున్నారు.