చరణ్‌, బుచ్చిబాబు మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ ఛేంజర్ ఎప్పుడో కంప్లీట్ కావాలి కానీ.. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఓ వైపు రీషూట్స్ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ నెలలో సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. క్రిస్మస్ కు ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. పరిస్థితి చూస్తుంటే.. క్రిస్మస్ కు రావడం అనేది అనుమానమే అనే టాక్ వినిపిస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే.. బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్‌ మూవీ ఎప్పుడో చేయాలి కానీ.. గేమ్ ఛేంజర్ కంప్లీట్ కాకపోవడం వలన ఆలస్యం అవుతూ వస్తోంది. ఇందులో చరణ్‌ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చరణ్‌ డేట్స్ కోసం బుచ్చిబాబు ఎదురు చూస్తూనే ఉన్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసిన చరణ్ ఇప్పుడు బుచ్చిబాబుతో చేసే మూవీ కోసం రెడీ అవుతున్నారు. ఇందులో చరణ్‌ స్పోర్ట్స్ కోచ్ గా కనిపించనున్నాడు. దీని కోసం ఆయన బీస్ట్ మోడ్ లోకి మారనున్నాడు. తాజాగా చరణ్ బీస్ట్ మోడ్‌కి మారుతున్న ఫోటోని బ్లాక్ షేడ్‌తో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇక RC16 లోడింగ్ అంటూ ఈ ఫోటోకి ఆయన క్యాప్షన్ ఇచ్చాడు. అయితే.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుందో చెప్పలేదు. అక్టోబర్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం.