వైవాహిక బంధంలోకి అదితీ, సిద్ధార్థ్

హీరోయిన్ అదితీ రావ్ హైదరి(Aditirao hydary), హీరో సిద్ధార్థ్(Siddharth) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తిలోని ఓ దేవాలయంలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది బంధు మిత్రులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదితీ, సిద్ధార్థ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.

తెలుగులో మహాసముద్రం(Mahasamudram) అనే సినిమాలో వీరు కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఈ జంట ఒకరికొకరు దగ్గరయ్యారు. అదితి, సిద్ధార్థ్ కలిసి ముంబైతో పాటు పలు చోట్ల కలిసి కనిపించారు. అప్పటినుంచే వీరి లవ్ గురించి మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అదితి, సిద్ధార్థ్ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.