ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “డీమాంటీ కాలనీ 2”

అరుల్ నిధి(Arulnithi), ప్రియ భవానీ శంకర్(priya bhavani shankar) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ 2″(demonty colony 2) తమిళంతో పాటు తెలుగులోనూ బిగ్ సక్సెస్ అందుకుంది. గత నెల 15న తమిళంలో 23న తెలుగులో రిలీజ్ కు వచ్చిందీ సినిమా. ఇప్పుడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 27వ తేదీ నుంచి జీ5(Zee5)లో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రోజు జీ 5 ఓ కొత్త పోస్టర్ తో ఈ అనౌన్స్ మెంట్ చేసింది.

“డీమాంటీ కాలనీ 2” సినిమాను తెలుగులో ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తీసుకొచ్చారు. థియేటర్స్ లో రికార్డ్ కలెక్షన్స్ అందుకున్న “డీమాంటీ కాలనీ 2” జీ5(Zee5)లోనూ టాప్ లో ట్రెండ్ అయ్యే అవకాశాలున్నాయి. హరర్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో మరోసారి చూడబోతున్నారు.