అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఎవరితో..?

అల్లు అర్జున్(Allu arjun) పుష్ప సంచలనం సృష్టించడంతో.. పుష్ప 2(Pushpa 2) పై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఎప్పుడెప్పుడు పుష్ప 2 థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా గురించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ నెక్ట్స్ ఏంటి అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ.. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ గురించి ప్రచారంలోకి వచ్చిన వార్త ఏంటి..?

పుష్ప 2 చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. డిసెంబర్ 6కు వాయిదా పడింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ చివరి దశకు రావడంతో బన్నీ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఆమధ్య అల్లు అర్జున్, అట్లీ(Atlee) కాంబోలో మూవీ అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఆతర్వాత కొన్ని కారణాల వలన ఈ క్రేజీ క్యాన్సిల్ అయ్యిందని ప్రచారం జరిగింది. దీంతో అల్లు అర్జున్.. త్రివిక్రమ్(Trivikram) తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని.. అట్లీ.. బాలీవుడ్ లో సల్మాన్ తో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపించింది. త్వరలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీని ప్రకటిస్తారని.. ఈసారి త్రివిక్రమ్ భారీ సోషియో ఫాంటసీ మూవీని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

అల్లు అర్జున్ నెక్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే అట్లీతో అల్లు అర్జున్ మూవీ ఫిక్స్ అని టాక్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, టీ సిరీస్(T series) కలిసి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయట. ఆల్రెడీ టీ సిరీస్ అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగ కాంబో మూవీని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్ తో సినిమా చేయనుందట. ఈ సినిమాను పుష్ప 2 రిలీజ్ కంటే ముందుగానే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ కాదు.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అని కూడా వినిపిస్తోంది. దీంతో అల్లు అర్జున్ నెక్ట్స్ ఎవరితో.. త్రివిక్రమ్ తో ఉంటుందా..? అట్లీతోనా..? అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.