“సైమా”లో మెరిసిన “బేబి”

దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్(SIIMA Awards) లో బేబి(Baby) మెరిసింది. ఈ సినిమాకు నాలుగు మేజర్ అవార్డ్స్ దక్కడం ఈవెంట్ లో పాల్గొన్న అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక చిన్న లవ్ స్టోరీగా రిలీజై బిగ్ కమర్షియల్ హిట్ కొట్టడమే కాదు దేశంలోని అన్ని మేజర్ అవార్ట్స్ నూ సొంతం చేసుకుంటూ వస్తోంది బేబి సినిమా. ఇప్పుడు సైమాలోనూ సత్తా చాటింది.

ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ “బేబి” సైమా 2024 అవార్డ్స్ లో బేబి సినిమా టీమ్ 4 అవార్డ్స్ అందుకున్నారు. బేబి సినిమాలో ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ బెస్ట్ యాక్టర్ క్రిటిక్ గా, వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్ గా సాయి రాజేష్, బెస్ట్ లిరిక్స్ విభాగంలో అనంత్ శ్రీరామ్ అవార్డ్స్ అందుకున్నారు. బేబి టీమ్ ఈ హ్యాపీ మూవ్ మెంట్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది.