ఆ ప్రశ్నకు సమాధానం సైమా అవార్డ్ – హీరో ఆనంద్ దేవరకొండ

కేవలం వారసత్వమే పరిశ్రమలో హీరోగా నిలబెట్టదు, ఎంతో ప్రతిభ ఉంటేగానీ స్టార్స్ కాలేరు. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు ఆనంద్ దేవరకొండ(Anand devarakonda). దొరసాని సినిమాతో జర్నీ మొదలుపెట్టి బేబితో బ్లాక్ బస్టర్ అందుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. ఈ గుర్తింపుతోనే తాజాగా సైమా బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డ్ అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్(SIIMa Awards) ఈవెంట్ లో హీరో రానా చేతుల మీదుగా సైమా బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డ్ అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – మా అన్నయ్య విజయ్ కు, నాకు ఫస్ట్ సైమా అవార్డ్ రానా చేతుల మీదుగా ఇచ్చాడు. బేబి సినిమా మెమెంతో గర్వపడేలా చేసింది. సైమా అవార్డ్ కూడా అందులో ఒకటి. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తో పాటు మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్న విజయ్ అండతో సినిమాల్లోకి వచ్చావ్ కదా అని నా కెరీర్ బిగినింగ్ లో అడిగేవారు. ఆ ప్రశ్నకు సమాధానం సైమా అవార్డ్. సినిమాను ప్రేమించే గొప్ప ప్రేక్షకులు ఉన్నంతవరకు నేను నటిస్తూనే ఉంటా. అని అన్నారు