తమిళ హీరో విజ‌య్ చివరి సినిమా అనౌన్స్ మెంట్

తమిళ హీరో విజయ్(Thalapathy vijay) నటిస్తున్న చివరి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. భారీ యాక్షన్ సినిమాలను రూపొందించే దర్శకుడు హెచ్ వినోద్(H vinod) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. థళపతి 69 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో పోస్టర్ రిలీజ్ చేశారు.

థళపతి 69 అనౌన్స్ మెంట్ పోస్టర్ రాజకీయ నేపథ్యంతో సినిమా ఉండబోతున్నట్లు తెలియజేస్తోంది. కాగడా పట్టుకున్న పరుగెత్తుతున్న విజయ్ ఫొటోకు టార్చ్ బేరర్ ఆఫ్ డెమొక్రసీ ఈజ్ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ రాశారు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి వెళ్తున్న సందర్భంగా ఆ ప్రాపగండా మూవీగా థళపతి 69 ఉండబోతోంది. వచ్చే ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.