కేన్సర్ బాధిత అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్

కేన్సర్ తో బాధపడుతున్న అభిమాని కౌశిక్(Koushik) కు వీడియో కాల్ చేసి మాట్లాడారు హీరో ఎన్టీఆర్(NTR). ఆరోగ్యంగా తిరిగి రావాలని, అతనికి ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడే అవకాశం రావడంతో కౌశిక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్నా నిన్ను చూసి మాట్లాడుతానని అనుకోలేదు అంటూ ఎన్టీఆర్ తో కౌశిక్ చెప్పారు.

సినిమా చూడటం తర్వాత నువ్వు ఆరోగ్యంగా మారి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి అంటూ ఎన్టీఆర్ అతనికి చెప్పారు. ఎన్టీఆర్ తన అభిమానితో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కౌశిక్ బోన్ కేన్సర్ తో బాధపడుతున్నాడు. దేవర(Devara) సినిమా చూసేవరకైనా నన్ను బ్రతికించండి అంటూ అతను వైద్యులను కోరడం, అది వివిధ మాధ్యమాల ద్వారా ఎన్టీఆర్ కు తెలిసింది. స్పందించిన ఎన్టీఆర్ కౌశిక్ తో మాట్లాడారు.