వేదిక “ఫియర్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ప్రభుదేవా

హీరోయిన్ వేదిక(Vedika) స్టార్ హీరోలతో కమర్షియల్ మూవీస్ లో గ్లామరస్ రోల్స్ తో పాటు పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ మెప్పించగలదు. సినిమాలే కాదు వెబ్ సిరీస్ లతోనూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వేదిక ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఫియర్”(Fear)తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా(Prabhu deva) రిలీజ్ చేశారు. టైటిల్ కు తగినట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ వేదిక ఫియర్ ఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంది.

“ఫియర్” సినిమాను దత్తాత్రేయ మీడియా(Dattathreya media) బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి(AR Abhi) నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని(Dr. Haritha gogineni) ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే అమెరికన్ గోల్డెన్ పిక్చర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ నెరేటివ్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ ఫిలింమేకర్ వంటి వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకోవడం విశేషం.