హ్యాట్రిక్ ఫ్లాప్ ఇచ్చిన రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj tarun) వరుసగా మూడో ఫ్లాప్ సినిమా ఇచ్చాడు. ఆయన రీసెంట్ మూవీ భలే ఉన్నాడే(Bhale unnade) నిన్న థియేటర్స్ లోకి వచ్చి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమాలు అద్భుతంగా ఉన్నాయంటే తప్ప ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నెగిటివ్ టాక్ కాదు మిక్స్డ్ టాక్ ఉన్నా కలెక్షన్స్ రావడం కష్టం. ఇలా చూస్తే రాజ్ తరుణ్ కొత్త సినిమా భలే ఉన్నాడే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం అసాధ్యం.

ఇటీవల రాజ్ తరుణ్ రెండు సినిమాలు తిరగబడరా సామీ(Thiragabadara samy), పురుషోత్తముడు(Purushottamudu) రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ గా మారాయి. ఇప్పుడు మూడో సినిమా భలే ఉన్నాడే కూడా అపజయం పాలవడంతో రాజ్ తరుణ్ అతి తక్కువ టైమ్ లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చిన హీరోగా కొత్త ఫీట్ చేశాడు. మరోవైపు మాజీ ప్రేయసి లావణ్య(Lavanya) పెడుతున్న కేసులతో పర్సనల్ లైఫ్ లోనూ ఈ యంగ్ హీరో ఇబ్బందులు పడుతున్నాడు.