“గేమ్ ఛేంజర్” మరోసారి వాయిదా ?

హీరో రామ్ చరణ్‌(Ram charan) నటిస్తున్న గేమ్ ఛేంజర్(Game changer) మూవీ రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడటం అనివార్యంగా కనిపిస్తోంది. దర్శకుడు శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఆ మధ్య నిర్మాత దిల్ రాజు(Dil raju) చెప్పారు. అయితే ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో క్రిస్మస్ కు సినిమా రావడం కష్టమే అంటున్నారు.

రీ షూట్ల కారణంగా మరికొంత టైమ్ కావాల్సిఉండగా..ఆ ఫుటేజ్ పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా టైమ్ స్పెండ్ చేయాలి. దీంతో పాటు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్లు లేకపోవడం కూడా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై అనుమానాలు కలిగిస్తోంది. సెకండ్ సాంగ్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేసినా ఇంకా దాన్ని విడుదల చేయలేదు. వినాయక చవితి రోజున గేమ్ చేంజర్ అప్డేట్ అంటే అందరూ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారనే భావించారు. తీరా సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ అంటూ అభిమానులను ఉసూరుమనిపించారు. ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి మేకర్స్ నుంచే క్లారిటీ రావాల్సిఉంది.