హరీష్ శంకర్ కి షాక్ ఇచ్చిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్(Hareesh shankar) కాంబినేషన్లో రూపొందిన చిత్రం గబ్బర్ సింగ్. ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మళ్లీ ఈ క్రేజీ కాంబోలో మూవీ చూడాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అభిమానుల కోరుకున్నట్టుగానే ఈ క్రేజీ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagatsingh) మూవీ రూపొందుతుండడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్స్ లో చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓ ఇరవై రోజుల షూటింగ్ మాత్రమే అయ్యింది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

అసెంబ్లీ ఎన్నికల ముందు పవర్ స్టార్ బిజీ అవ్వడంతో ఉస్తాద్ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం అవ్వడం వలన వర్క్ లో ఫుల్ బిజీగా ఉండడంతో మరింత ఆలస్యం అయ్యింది. అయితే.. ఈ నెల రెండో వారం నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నారు. హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నిర్మాతలకు మాట ఇచ్చారు. షూటింగ్ లో జాయిన్ అవుతాను.. వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. వీరమల్లు మేకర్స్ అయితే.. తాడేపల్లిలో పెద్ద సెట్ వేశారు. అంతా రెడీ పవన్ షూట్ లో జాయిన్ అవుతారు అనగా ఏపీలో వరదలు వచ్చాయి.

దీంతో పవన్ మళ్లీ బిజీ అవ్వడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఎప్పుడు మళ్లీ డేట్స్ ఇస్తారో క్లారిటీ లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. మూడు సినిమాలకు డేట్స్ ఇవ్వాలి అనుకున్న పవన్.. మనసు మార్చుకున్నారట. వీరమల్లు, ఓజీ సినిమాలకే ఈ ఇయర్ లో డేట్స్ ఇవ్వాలని.. ఉస్తాద్ భగత్ సింగ్ కి నెక్ట్స్ ఇయర్ డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఇయర్ ఎండింగ్ లేదా జనవరికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకున్న హరీష్ శంకర్ కు ఇది షాక్ అని చెప్పచ్చు. సో.. ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో జరిగే వరకు ఏం చెప్పలేం అంటున్నారు సినీ జనాలు.