“రాధ”గా ఆకట్టుకుంటున్న తన్వీరామ్ – “క” సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

గతేడాది మలయాళంతో పాటు తెలుగులోనూ బిగ్ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న సినిమా 2018. ఈ సినిమాతో మన ఆడియెన్స్ కు దగ్గరైంది యంగ్ అండ్ ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్ తన్వీ రామ్. నాని “అంటే సుందరానికీ..” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిందీ నాయిక. ఇప్పుడు కిరణ్ అబ్బవరం క్రేజీ మూవీ “క”తో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించబోతోంది. ఆమె “క” సినిమాలో రాధ అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేశారు. రాధ క్యారెక్టర్ ట్రెడిషినల్ లుక్స్ లో ఆకట్టుకుంది తన్వీ రామ్.

మిస్ కేరళ 2012 ఫైనలిస్ట్ గా అందరి దృష్టిని ఆకర్షించిన తన్వీరామ్..2018 చిత్రంతో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్ పై ఆమె దృష్టి పెట్టింది. కిరణ్ అబ్బవరం “క” సినిమా ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాతో తన్వీ రామ్ కు తెలుగులో బ్రేక్ దక్కేలా ఉంది. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో దర్శక ద్వయం సుజీత్, సందీప్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.