వరద బాధతులకు అండగా నిలిచిన టీవీ ప్రొడ్యూసర్స్

వరద బాధితుల(Flood victims)ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్(Telugu Television Producers Association). తమ అసోసియేషన్ తరుపున విరాళం(Donation) ప్రకటించారు. తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో ఉన్న 260 మంది ప్రొడ్యూసర్స్ నుంచి ఎవరికి వీలైనంత వాళ్లు ఆర్థిక సాయం ఇస్తున్నారు. 5 వేల నుంచి 25వేల వరకు డొనేషన్స్ ఇస్తున్నారు. ఇదంతా కలిపి 10 నుంచి 15 లక్షల దాకా కానుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద రావు తెలిపారు.

సేకరించిన విరాళాలకు తోడు తమ అసోసియేషన్ వద్ద ఉన్న ఫండ్ లో కొంత కలిపి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు వరద బాధితుల సహాయ చర్యలకు అందిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ వివరాలు తెలిపే కార్యక్రమంలో టీవీ ప్రొడ్యూసర్స్ నుంచి ప్రభాకర్, శ్రీరామ్, వినోద్ బాల తదితరులు హాజరయ్యారు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లేదా డిఫ్యూటీ సీఎంలను కలిసి ఈ డబ్బును అందిస్తామని వారు తెలిపారు.