ఓటీటీలోకి వచ్చేసిన “మిస్టర్ బచ్చన్”, “ఆయ్”, “కమిటీ కుర్రోళ్లు”

ఈ రోజు మూడు సినిమాలు మిస్టర్ బచ్చన్(Mr bachan), ఆయ్(AAY), కమిటీ కుర్రోళ్లు(Committee kurrollu) ఓటీటీలోకి వచ్చాయి. నెట్ ఫ్లిక్స్(Netflix) లో మిస్టర్ బచ్చన్, ఆయ్ స్ట్రీమింగ్ అవుతుండగా..ఈటీవీ విన్(ETV Win) యాప్ లో కమిటీ కుర్రోళ్లు స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాలను థియేటర్ లో మిస్ అయి డిజిటల్ ప్రీమియర్ చూస్తున్న నెటిజన్స్ తమ అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో మిస్టర్ బచ్చన్ సినిమాకు నెగిటివ్ కామెంట్స్ వస్తుండగా, ఆయ్, కమిటీ కుర్రోళ్లు సినిమాలు బాగున్నాయంటూ పోస్ట్ లు చేస్తున్నారు. రవితేజ(Ravi teja) హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. నిర్మాణ సంస్థకు భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఇక నార్నే నితిన్(Narne nithin), నయన్ సారిక(Nayan sarika) జంటగా కొత్త దర్శకుడు అంజి కె మణిపుత్ర ఆయ్ సినిమాను రూపొందించారు. బన్నీవాస్, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. గోదావరి జిల్లా నేపథ్యంలో ఎంటర్ టైన్ చేసే లవ్ స్టోరీగా ఆయ్ సినిమాకు పేరొచ్చింది. నిహారిక కొణిదెల కొత్త నటీనటులతో నిర్మించిన కమిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.