ఏకపక్షంగా విడాకులు ప్రకటించాడు – జయం రవిపై భార్య ఆర్తి ఆరోపణ

తనతో చెప్పకుండానే ఏకపక్షంగా విడాకుల ప్రకటన చేశాడంటూ కోలీవుడ్ హీరో జయం రవి(Jayam ravi)పై ఆరోపణలు చేశారు ఆయన భార్య ఆర్తి(Aarthi). ఈ విడాకుల(Divorce)తో తనకు, తన పిల్లలకు మంచి జరగదని ఆమె చెప్పారు. పిల్లలపై ప్రభావం పడకూడదనే తను బయటకు వచ్చి మాట్లాడటం లేదని ఆర్తి తెలిపారు. గత 18 ఏళ్లుగా జయం రవితో కలిసి ఉన్నానని, ఇప్పుడు తనను సంప్రదించకుండానే విడాకుల ప్రకటన చేశాడని ఆర్తి ఆరోపిస్తోంది.

ఆర్తి స్పందిస్తూ – గత కొంతకాలంగా జయం రవిని కలిసేందుకు, సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నా. అతను అందుబాటులోకి రావడం లేదు. ఇప్పుడు తనొక్కడే విడాకుల నిర్ణయం తీసుకుని ప్రకటించాడు. నేను విడాకులు కోరుకోలేదు. అది నాపై, నా పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తుంది. మా మధ్య బేధాభిప్రాయాలు పరిష్కరించుకునేందుకు నావంతు ఎంతో ప్రయత్నం చేశా. అని చెప్పింది. జయం రవి భార్య ఆర్తితో విడిపోతున్నట్లు నిన్న ప్రకటన చేశాడు.