“దేవర” ఈవెంట్ లో ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

ముంబైలో దేవర(Devara) ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్(NTR), జాన్వీ కపూర్, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో కొరటాల శివ గురించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ చిరంజీవి గురించే ఆ కామెంట్స్ చేశాడా అనే డౌట్స్ నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడిగా కొరటాల శివ పనితనం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ తన చుట్టూ సరైన వారు ఉంటే, తనకు సరైన వాళ్లు దొరికితే కొరటాల శివ(Koratala siva) మంచి సినిమా చేస్తాడని అన్నారు.

కొరటాల శివ దర్శకుడిగా చూసిన అతి పెద్ద ఫెయిల్యూర్ ఆచార్య(Acharya). చిరంజీవి(Chiranjeevi) హీరోగా రామ్ చరణ్ గెస్ట్ గా నటించిన ఈ సినిమా దర్శకుడిగా కొరటాల శివకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. సినిమాలో ఏ సీన్ కూడా ఆకట్టుకోలేదు. చిరంజీవి గారు చెప్పినట్లు చేశానంటూ అప్పట్లో కొరటాల శివ చెప్పడం కూడా సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సందర్భాన్ని గుర్తుచేసేలా మాట్లాడారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.