రివ్యూ – ఎన్టీఆర్ “దేవర” ట్రైలర్

ఎన్టీఆర్(NTR) హీరోగా నటిస్తున్న దేవర(Devara) సినిమా ట్రైలర్(Devara trailer) రిలీజైంది. ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో అని ఎన్టీఆర్ అభిమానులు, మూవీ లవర్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు ముంబైలో జరిగిన బిగ్ ఈవెంట్ లో దేవర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కల్యాణ్ రామ్ నిర్మాతగా దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందించారు. జాన్వీ హీరోయిన్ గా నటించింది. రెండు భాగాల దేవరలో ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది.

దేవర ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…సముద్రాన్ని నమ్ముకుని బతుకుతున్న గంగపుత్రుల జీవితాలను అల్లకల్లోలం చేస్తాడు ఓ క్రూరమైన విలన్. వారికి భయం అంటే తెలియదు. ఎదురొచ్చిన వారిని, మాట వినని వారి రక్తం కళ్ల చూస్తుంటారు. అలాంటి వారికి భయాన్ని పుట్టిస్తాడు దేవర. బతికేంత ధైర్యం మనిషికి చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదంటూ దేవర వారిని మళ్లీ గంగపుత్రుల వైపు చూడకుండా తరిమేస్తాడు. దేవర జీవితంలో ఈ పోరాటం ఒక భాగమైపోతుంది. అతని కొడుకే మరో ఎన్టీఆర్. ఇతనికి భయం ఎక్కువ. తండ్రి పోలికలు వచ్చినా ధైర్యం రాలేదు. అతన్ని ఆటపట్టిస్తుంటుంది జాన్వీ. పిల్లి లాంటి కొడుకు పులిలా మారే సందర్భం వస్తుంది. అప్పుడు దేవర అరంగేట్రం చేస్తాడు. ఈ సందర్భం దేవరలో హై ఎమోషన్ లో ఉండబోతోంది. తండ్రీ కొడుకుల ఫార్ములా, ఒక నాయకుడి ధీరత్వం అనే అంశాలతో రెగ్యులర్ ఫార్మేట్ లోనే కొరటాల శివ కథను రాసుకున్నాడు. సముద్ర నేపథ్యం ఒక్కటే కొత్తది అనుకోవచ్చు. అయితే మేకింగ్ లో, డైలాగ్స్ లో కొరటాల శివ ఫైర్ కనిపించింది. ఎప్పటిలాగే అనిరుధ్ దేవర విషయంలో నిరాశపర్చాడు. ట్రైలర్ కు ఉన్న మెయిన్ మైనస్ బీజీఎం. కథలోని ఎమోషన్స్ కనెక్ట్ అయితే దేవర పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.