“ది రాజా సాబ్” షూటింగ్ అప్డేట్ ఇదే

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్(The raja saab). ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) బ్యానర్ పై డైరెక్టర్ మారుతి(Director maruthi) రూపొందిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైమ్ హారర్ జానర్ లో చేస్తున్న చిత్రంగా ది రాజా సాబ్ పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్, హీరోయిన్స్ పాల్గొంటున్న ఇంపార్టెంట్ సీన్స్ హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. ఇవి ఫన్, ఎంటర్ టైన్ సీన్స్ అని తెలుస్తోంది. ప్రభాస్ ఇటీవల ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో మంచి ఎంటర్ టైనర్ లో రెబల్ స్టార్ ను చూడటం కొత్తగా ఉండనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేట్రికల్ రిలీజ్ కు రానుంది.