తెలుగు రాష్ట్రాల్లో వరదల(Floods) కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమా విడుదల కరెక్ట్ కాదని భావించారు “ధూం ధాం”(Dhoom dhaam) సినిమా నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్. చేతన్ కృష్ణ(Chetan krishna), హెబ్బా పటేల్(Hebba patel) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 13న “ధూం ధాం” సినిమా విడుదల కావాల్సిఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ బిగిన్ చేశారు. సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వచ్చారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
“ధూం ధాం” సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మూవీ టీమ్ రిలీజ్ కు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలకు ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం సరికాదని భావించారు మేకర్స్. సినిమా రిలీజ్ వాయిదా వేస్తూ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఈరోజు అనౌన్స్ చేశారు. “ధూం ధాం” సినిమాను ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.