రామ్ చరణ్‌, నాగచైతన్య… క్రిస్మస్ కు వచ్చేది ఎవరు..?

నాగచైతన్య(Naga chaitanya) నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ తండేల్(Thandel). ఈ మూవీకి చందు మొండేటి డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ మూవీని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. డిసెంబర్ 20న తండేల్ రిలీజ్ అని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే.. క్రిస్మస్ కు పోటీ పెరగడంతో దసరా తర్వాత తండేల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తామని బన్నీ వాసు ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ram charan) ఎప్పటి నుంచో నటిస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్(Game changer). ఈ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ కావాలి కానీ..ఇండియన్ 2 షూట్ చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ ఆలస్యం అయ్యింది. అయితే.. ఈ మూవీని క్రిస్మస్ కు రిలీజ్ చేస్తున్నట్టుగా దిల్ రాజు ప్రకటించారు. అయితే.. ప్రకటించడం అయితే ప్రకటించారు కానీ.. వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.

వినాయక చవితి సందర్భంగా గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఇస్తున్నామంటి ఊరించారు. దీంతో మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని ఆతృతగా ఎదురు చూస్తే.. ఈ నెలలో సెకండ్ సింగిల్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. సెకండ్ సాంగ్ రిలీజ్ కే డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నారు. ఇక క్రిస్మస్ కు రావడం అనుమానమే అనేది క్లారిటీ వచ్చేసింది. గేమ్ ఛేంజర్ రాకపోతే తండేల్ రావడం ఖాయం. గేమ్ ఛేంజర్ గురించి ఇంకా క్లారిటీ రావాలంటే.. దసరా వరకు వెయిట్ చేయాలేమో.