విడాకులు తీసుకున్న తమిళ హీరో

తమిళ హీరో జయం రవి(Jayam ravi) వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. భార్య ఆర్తి(arti)తో విడాకులు(Divorce) తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జయం రవి తెలిపారు. జయం రవి ఆర్తి విడాకుల గురించి గతంలోనే వార్తలు రాగా..అవన్నీ రూమర్స్ అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఈరోజు జయం రవి తన విడాకుల విషయాన్ని ప్రకటించారు. జయం రవి, ఆర్తి 15 ఏళ్లు వైవాహిక జీవితంలో కలిసి ఉన్నారు.

విడాకులపై జయం రవి స్పందిస్తూ – ఆర్తి, నేను వైవాహిక బంధం నుంచి విడిపోతున్నాం. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు. మా జీవితాలతో ముడిపడిన అందరి బాగు కోసం తీసుకున్న నిర్ణయం. ఒకరినొకరం గౌరవించుకుంటూ విడిపోవాలని అనుకున్నాం. వ్యక్తిగతంగా ఇబ్బందికరమైన ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను, ప్రైవసీని కాపాడుతారని కోరుకుంటున్నాం. నటుడిగా ఇకపైనా ఇలాగే మంచి సినిమాలు చేస్తూ మీ ఆదరణ పొందుతా. అని పేర్కొన్నారు.