వెంకీమామ కోసం వస్తున్న సల్మాన్

ఇటీవల బాలీవుడ్ ఆర్టిస్టులు తెలుగులో విరివిగా నటిస్తున్నారు. సల్మాన్ లాంటి స్టార్స్ కూడా తెలుగు మూవీస్ లో పార్ట్ అవుతున్నారు. ఆ మధ్య చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్(Salman Khan) ఓ గెస్ట్ లో చేశాడు. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ మూవీలో కనిపించబోతున్నారీ బాలీవుడ్ స్టార్. వెంకటేష్(Venkatesh) హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి(Anil ravipudi) రూపొందిస్తున్న కొత్త చిత్రంలో సల్మాన్ అతిథిగా మెరుస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు సల్మాన్ ఓకే చెప్పాడట.

ఎఫ్ 2(F2), ఎఫ్ 3(F3) తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్(Ishwarya rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi chowdary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.