రాజ్ తరుణ్, మాల్వీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య

తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకుంటూ వస్తున్నారు రాజ్ తరుణ్(Raj tarun), మాల్వీ మల్హోత్రా(Malvi malhotra). తిరగబడరా సామీ సినిమాలో జంటగా నటించారు వీళ్లిద్దరు. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య(Lavanya) మాత్రం రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీతోనే కలిసి ఉంటున్నాడని అంటోంది. అనడమే కాదు తాజాగా వీళ్లిద్దరిని ముంబైలోని ఓ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ వీడియోలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇంట్లో వేసుకునే కాజువల్ డ్రెస్సుల్లో ఉన్నారు.

లావణ్య ఆ వీడియోలో రాజ్ తరుణ్ ను వదిలేయ్ అంటూ మాల్వీపై అరుస్తూ గొడవ చేసింది. ఈ వీడియోను లావణ్య మీడియాకు రిలీజ్ చేసింది. మరోవైపు రాజ్ తరుణ్ పై లావణ్య ఇచ్చిన కంప్లైంట్ లో నిజాలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. ఈ కేసులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చి అతని మీద ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్.