న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ‘మల్లెపూల ట్యాక్సీ..’ సాంగ్

చేతన్ కృష్ణ(Chetan krishna), హెబ్బా పటేల్(Hebba patel) జంటగా నటించిన “ధూం ధాం”(Dhoom Dhaam) సినిమాలోని ‘మల్లెపూల ట్యాక్సీ..'(Mallepoola taxi) సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. మంగ్లీ పాడిన ఈ మాస్ పాట మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ పాట మన దేశం దాటి యూఎస్ లో స్క్రీనింగ్ కు వెళ్లింది. ‘మల్లెపూల ట్యాక్సీ..’ సాంగ్ పాటను అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్(Newyork times square) వద్ద ప్రదర్శించారు. ఈ పాట ప్లే చేస్తున్నప్పుడు అక్కడి ఎన్ఆర్ఐలు స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు.

“ధూం ధాం” చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 12వ తేదీన “ధూం ధాం” సినిమా యూఎస్ ప్రీమియర్స్ స్టార్ట్ చేస్తున్నారు.