రిలీజ్ కు ముందే “దేవర” రికార్డ్ లు

ఎన్టీఆర్(NTR) నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర(Devara). ఈ మూవీకి కొరటాల శివ(Koratala siva) డైరెక్టర్. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది. ఏంటా రికార్డ్ అంటారా..? ఈ మూవీకి సంబంధించి ఓవర్ సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే.. ఇప్పటి వరకు యు.ఎస్.ఎ(US boxoffice) లో 15,000 టిక్కెట్లు సేల్ అయ్యాయి. రిలీజ్ కు ముందు ఫాస్ట్ గా 15,000 టిక్కెట్లు సేల్ అయిన మూవీగా దేవర నిలిచింది. ఈ సేల్స్ తో ఆఫ్ మిలియన్ మార్క్ ను చేరుకుంది. దీనిని బట్టి దేవరకు ఎంత క్రేజ్ ఉందో అర్థమౌతుంది. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. యువ సంగీత సంచలనం అనిరుథ్ సంగీతం అందించారు. ఈ మూవీతో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతుంది. సెప్టెంబర్ 27న రానున్న దేవరతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.