పూరితో సినిమా చేసే హీరోలు ఉన్నారా..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్(Puri jagannath). ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన పూరి ఇప్పుడు వరుస ఫ్లాపులతో కెరీర్ లో వెనకబడ్డాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్(Double ismart) వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూరి పరిస్థితి ఏంటి..? నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నాడు..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ప్లాపుల్లో ఉన్న పూరితో సినిమా చేసే హీరో ఎవరు..?

పూరి ఒకప్పుడు ఎన్నో హిట్లు ఇచ్చాడు.. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. అలాగే ఫ్లాపులు కూడా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌.. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసి వాళ్లను సరికొత్తగా చూపించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించాడు. అయితే.. లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఫామ్ కోల్పోయిన పూరి మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ట్రాక్ లోకి వస్తాడనుకున్నారు. ప్రతి సినీ ప్రేమికుడు పూరి ఫామ్ లోకి రావాలని కోరుకున్నాడు కానీ.. డబుల్ ఇస్మార్ట్ అంచనాలను అందుకోలేకపోయింది. పూరికి మళ్లీ నిరాశే ఎదురైంది.

డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరితో సినిమా చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అయితే.. పూరి.. బాలకృష్ణ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపించింది. పైసా వసూల్ తర్వాత బాలకృష్ణ పూరితో మరో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు బాలకృష్ణ బిజీగా ఉన్నారు. మరో వైపు మోక్ఝజ్ఞ తొలి సినిమా పై దృష్టి పెట్టారు. ఇంత బిజీలో పూరితో బాలకృష్ణ సినిమా ఇప్పట్లో ఉండదు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఫుల్ బిజీగా ఉన్నారు. మరి.. పూరి ఎవరితో చేయనున్నారంటే.. తేజ సజ్జ, విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ యంగ్ హీరోలు కూడా బిజీగానే ఉన్నారు. మరి.. వీళ్లైనా పూరితో సినిమా చేయడానికి ఎస్ అంటారో నో అంటారో చూడాలి మరి.