రూ.500 కోట్ల క్లబ్ లో “స్త్రీ 2”

శ్రద్ధా కపూర్(Shradda kapoor), రాజ్ కుమార్ రావ్(Rajkumar rao) నటించిన స్త్రీ 2(Stree 2) సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం మూడో వారంలోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. థర్డ్ వీక్ లో 500 కోట్ల రూపాయల క్లబ్ లోకి స్త్రీ 2 సినిమా చేరింది. ఈ సినిమా 526 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది.

థర్డ్ వీక్ లోనూ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ఉండటంతో స్త్రీ 2 సినిమా మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. హారర్ కామెడీ కథతో స్త్రీ 2 సినిమాను దర్శకుడు అమర్ కౌశిక్ రూపొందించారు. గతంలో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన స్త్రీ 2 మొదటి సినిమాను మించిన సక్సెస్ దక్కించుకుంది. హారర్ థ్రిల్లర్స్ తో ఫేమస్ అయిన మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.