మోక్షజ్ఞతో మూవీ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ

హీరో బాలకృష్ణ(Balakrishna) కొడుకు మోక్షజ్ఞ(Mokshagna)తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashant varma). హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు ప్రశాంత్ వర్మ.

మోక్షజ్ఞ ఎంట్రీ మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్(SLV cinemas) బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ప్రశాంత్ వర్మ స్పందిస్తూ – మోక్షజ్ఞను పరిచయం చేసే అవకాశం కల్పించిన బాలకృష్ణకు థ్యాంక్స్. మోక్షజ్ఞను తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆకట్టుకునేలా చూపించబోతున్నా. ఇది మా టీమ్ అందరికీ మెమొరబుల్ మూవీ అవుతుంది. అని ట్వీట్ చేశారు.