సీక్రెట్ బయట పెట్టిన తమన్నా

మిల్కీ బ్యూటీ అంటే ఠక్కున గుర్తొచ్చేది తమన్నా. ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన తమన్నా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఇటీవల ఐటం సాంగ్స్ కు కూడా ఓకే చెబుతుంది. వరుసగా ఐటం సాంగ్స్ చేస్తుండడం గురించి అసలు విషయం బయటపెట్టింది. ఇంతకీ.. తమన్నా ఏం చెప్పింది..?

శ్రీ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా తొలి సినిమాతో నటిగా మెప్పించిన సక్సెస్ రాలేదు. ఆతర్వాత హ్యాపీడేస్ మూవీలో తన అందం, అభినయంతో ఆకట్టుకుని సక్సెస్ సాధించింది. ఇక అక్కడ నుంచి కెరీర్ లో వెనకతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. రెడీ, 100 పర్సెంట్ లవ్, ఊసరవెల్లి, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, బాహుబలి, సైరా నరసింహారెడ్డి.. ఇలా ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో విభిన్నపాత్రలతో మెప్పించింది. ఇటు సౌత్ సినిమాల్లోనూ, అటు నార్త్ సినిమాల్లోనూ నటించి ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది.

అయితే.. తమన్నా ఇటీవల ఐటం సాంగ్స్ చేస్తుంది. ఇలా చేయడం కొత్త కాదు.. గతంలో కూడా ఐటం సాంగ్స్ లో నటించింది కానీ.. బ్యాక్ టు బ్యాక్ ఐటం సాంగ్స్ చేయడం పై తమన్నా స్పందించింది. అరణ్మయి 2 సినిమాలో రాశీఖన్నాతో కలిసి తమన్నా ఐటం సాంగ్ చేయడం అది పెద్ద హిట్ అవ్వడం జరిగింది. జైలర్ మూవీలో చేసిన కావాలా ఐటం సాంగ్ కూడా హిట్టైయ్యింది. ఇటీవల స్త్రీ 2 మూవీలో కూడా ఐటం సాంగ్ చేసింది. ఇలా వరుసగా ఐటం సాంగ్స్ చేయడం గురించి తమన్నా ఏమన్నదంటే.. వెంటవెంటనే 2 ఐటెంసాంగ్స్ చేస్తే కెరీర్ పై ప్రభావం పడుతుందేమోనని భయటపడిందట. అయితే దర్శకుడు ఆ సాంగ్ తో పాటు, దాని నేపథ్యాన్ని చెప్పడంతో.. సినిమాలో కీలకమైన పార్ట్ లో తన పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలిసిన తర్వాత ఆ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట మిల్కీబ్యూటీ. సినిమాలో పాత్ర నిడివి ఎంత ఉందనే విషయం గురించి ఆలోచించకుండా ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుంటుందా..? లేదా..? అనే కోణంలోనే ఆలోచిస్తానని అసలు విషయం బయటపెట్టింది తమన్నా.