నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లో నెం.1 గా ప్రభాస్ “కల్కి”

రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebelstar prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి (Kalki 2898 AD) నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. నాన్ ఇంగ్లీష్ వెర్షన్ లో నెం.1 ప్లేస్ ను కల్కి దక్కించుకుంది. ఈ సినిమాకు ఈ వారం( ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1)లో 2.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 7.5 మిలియన్ అవర్స్ ఈ సినిమాను 11 దేశాల్లోని ప్రేక్షకులు చూశారు. ఇప్పటికీ కల్కి నాలుగు దేశాల్లో నెం.1 ప్లేస్ లో ఉంది.

గత నెల 22న ఈ సినిమా నెట్ ప్లిక్స్(Netflix), అమోజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video)లో స్ట్రీమింగ్ కు వచ్చింది. గత రెండు వారాల్లో 7.1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin) సైన్స్ ఫిక్షన్ మైథాలజీ కలిపిన కథతో కల్కి సినిమాను రూపొందించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పడుకోన్, దిశా పటానీ, విజయ్ దేవరకొండ వంటి స్టార్ కాస్ట్ కల్కి సినిమాకు ఆకర్షణగా నిలిచారు.