“హిట్ 3” అనౌన్స్ చేసిన నాని

నాని(Nani) హీరోగా హిట్ 3(HIT 3) సినిమాను అనౌన్స్ చేశారు. ఇది నాని నటిస్తున్న 32వ సినిమా. శైలేష్ కొలను(Sailesh kolanu) దర్శకత్వం వహిస్తున్నారు. యునానమస్ ప్రొడక్షన్ తో కలిసి నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిట్ 3 సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఈరోజే ప్రకటించారు. వచ్చే ఏడాది మే 1న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

హిట్ 3 అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటిదాకా విశ్వక్ సేన్ హీరోగా హిట్, అడివి శేష్ హీరోగా హిట్ 2 సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు నాని అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ తో హిట్ 3 చేస్తున్నారు. నానికి ఈ తరహా క్యారెక్టర్స్, మూవీస్ ఎంతవరకు సెట్ అవుతాయో హిట్ 3 డిసైడ్ చేయనుంది.