“దేవర”లో కారంచేడు ఊచకోత నిజమేనా..?

ఎన్టీఆర్(NTR) నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర(Devara). ఈ మూవీకి కొరటాల శివ(Koratala siva) డైరెక్టర్. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ సాంగ్స్, గ్లింప్స్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి. కొరటాల తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో ఎంతో కసితో ఈ సినిమాను చేశాడు. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో జరుగుతుందనే విషయం తెలిసిందే కానీ.. కథ గురించి అంతకు మించి ఏదీ బయటకు రాలేదు. ఇప్పుడు ఈ మూవీలో కారంచేడు ఊచకోత గురించి ప్రస్తావన ఉంటుందని.. దీన్ని రిపెరెన్స్ గా వాడుకున్నారని టాక్ వినిపిస్తోంది.

కారంచేడు(Karamchedu) ఊచకోత గురించి అప్పటి జనాలకు బాగా తెలుస్తుంది కానీ.. నేటి యువతకు దీనికి గురించి తెలియదు. అసలు ఏం జరిగిందంటే.. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో ఆరుగురు దళితులు అగ్రకులానికి చెందిన వారి చేతుల్లో హత్యకు గురయ్యారు. ముగ్గురు మహిళలను మానభంగానికి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా కారంచేడు భగ్గమంది. దీంతో నక్సలైట్లు రంగంలోకి దిగి ఈ దుర్ఘటనకు కారణమైన వాళ్లకు మరణశిక్ష విధించారు.

ఇది రాజకీయంగా దుమారం రేపింది. అప్పుడప్పుడు ఈ కారంచేడు ఊచకోత గురించి సినిమాల్లో ప్రస్తావన వస్తుంటుంది. ఇప్పుడు దేవరలో కూడా దీని స్పూర్తితోనే ఊచకోత ఎపిసోడ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. కొరటాల దీని గురించి పరిశోధన చేసిన మాట వాస్తవమే కానీ.. ఇది పూర్తిగా వేరేలా ఉంటుందని.. సముద్రం ఒడ్డున ఊచకోత వేరే లెవల్లో ఉంటుందని టాక్. మరి..కొరటాల ఏం చేస్తారో.. ఏం చూపించనున్నారో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.