రీ రిలీజ్ లో “గబ్బర్ సింగ్” జోరు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan Kalyan) గబ్బర్ సింగ్(Gabbar singh) సినిమా రి రిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. ఈ సినిమాకు దాదాపు 6 కోట్ల రూపాయల వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల కాలంలో ఏ రీ రిలీజ్ సినిమాకూ రానంతగా వసూళ్లు గబ్బర్ సింగ్ కు దక్కడం విశేషం. వసూళ్లలో ఇంద్ర(Indra)ను మించి పర్ ఫార్మ్ చేస్తోంది గబ్బర్ సింగ్.

నిన్న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 4కేలో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో పవన్ గెల్చి డిఫ్యూటీ సీఎం కావడం కూడా ఏపీలో వసూళ్లను ప్రభావితం చేసింది. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్స్ తో పాటు మల్టీప్లెక్స్ ల్లోనూ గబ్బర్ సింగ్ కలెక్షన్స్ జోరు కనిపిస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లో గబ్బర్ సింగ్ కలెక్షన్స్ హాఫ్ మిలియన్ దాటేశాయి.