ఈ బాలీవుడ్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా?

సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీగా సింగం సినిమాలకు పేరుంది. సూర్య హీరోగా నటించిన తమిళ హిట్ మూవీ సింగం అదే పేరుతో తమిళంలో అజయ్ దేవగణ్ హీరోగా రీమేక్ అయ్యింది. హిందీలోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా సింగం అగైన్(Singham again) సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి(Rohit shetty).

బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్(Ajay devgan) కాంబోలో వస్తున్న సింగం అగైన్ సినిమాపై బాలీవుడ్ లో హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా నుంచి వినిపిస్తున్న మరో రూమర్ సింగం అగైన్ సినిమా పట్ల మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) గెస్ట్ రోల్ చేస్తున్నారనేది బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న మాట. బాహుబలి, సాహో, సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. దాంతో సింగం అగైన్ లో ప్రభాస్ గెస్ట్ రోల్ ఆకర్షణ కానుంది.