మలయాళ స్టార్ కిడ్ తో కొరటాల నెక్ట్స్ మూవీ

దర్శకుడు కొరటాల శివ(Koratala siva) కెరీర్ దేవర సక్సెస్ మీద ఆధారపడి ఉంది. ఆయన గత చిత్రం ఆచార్య(Acharya) ఫ్లాప్ కావడంతో ఈ దర్శకుడికి ఉన్న మంచి పేరు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఒక్క ఫ్లాప్ తో అప్పటిదాకా కొరటాలతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిన స్టార్ హీరోల సందేహించే పరిస్థితి ఏర్పడింది. తనతో జనతా గ్యారేజ్ మూవీ చేసిన కొరటాలతో దేవర(Devara) మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా రెండు పార్టుల తర్వాత కొరటాల ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ లేదు.

తెలుగులో ఏ హీరో కూడా ఖాళీగా లేరు. ప్రతి స్టార్ హీరో ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందుచేత మలయాళ హీరో మోహన్ లాల్(Mohanlal) తనయుడు ప్రణవ్ తో కొరటాల పాన్ ఇండియా సినిమా చేయనున్నాడని తెలిసింది. కొరటాల ఇప్పటికే ప్రణవ్(Pranav) కు కథ చెప్పడం.. ఆ కథ నచ్చి ఓకే చెప్పడం జరిగిందని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందట. వచ్చే ఏడాది ఈ సినిమాకు సన్నాహాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.