మరో రిస్క్ కు రెడీ అయిన “హనుమాన్” మేకర్స్

తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్(Hanuman) సినిమా నిర్మించి భారీ లాభాలతో పాటు మంచి పేరు తెచ్చుకుంది ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్(Prime show entertainments) బ్యానర్. హనుమాన్ మేకర్స్ గా నిరంజన్ రెడ్డి(K niranjan reddy), చైతన్య రెడ్డి నిర్మాతలుగా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్నారు. హనుమాన్ తర్వాత ఈ నిర్మాతలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రామ్ హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఆల్ థియేట్రికల్ రైట్స్ కొని భారీగా నష్టపోయారు. ప్రియదర్శి హీరోగా డార్లింగ్ సినిమా తీసి ఫ్లాప్ చూశారు.

ఈ రెండు సినిమాలతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సక్సెస్ ఫుల్ సంస్థ అనే రెప్యుటేషన్ కూడా పోగొట్టుకుంది ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్. ఇప్పుడు మరో భారీ రిస్క్ కు రెడీ అయ్యిందీ సంస్థ. కిచ్చా సుదీప్(Kicha sudeep) హీరోగా అనూప్ బంఢారి దర్శకత్వంలో బిల్లా రంగా బాషా(Billa ranga basha) అనే పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశారు హనుమాన్ మేకర్స్. ఈ సినిమా 2209వ సంవత్సరంలో జరిగే ఫ్యూచరిస్టిక్ మూవీ. ఈ సినిమా మోషన్ పోస్టర్ లో ప్రపంచం అంతా విధ్వంసానికి గురైనట్లు చూపించారు. బడ్జెట్ పరంగా భారీ వ్యయం పెడుతున్నట్లు మోషన్ పోస్టర్ తో తెలుస్తోంది. ఈ సినిమా ఫలితంపైనే హనుమాన్ మేకర్స్ సంస్థ ఫ్యూచర్ ఆధారపడి ఉందని అనుకోవచ్చు.