పవర్ స్టార్ సినిమాల రిలీజ్ ఎప్పుడు..?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) ఓజీ(OG), హరి హర వీరమల్లు(Hari Hara veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagatsingh) చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే.. ఓజీ, వీరమల్లు చాలా వరకు పూర్తయ్యయి కానీ..ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం చాలా వరకు షూటింగ్ చేయాల్సివుంది. ఈ రోజు పవన్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్(Gabbar singh) మాత్రం రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇక విడుదలైన ప్రతి ఏరియాలో గబ్బర్ సింగ్ మూవీకి అనూహ్య స్పందన వచ్చింది.

పవన్ సినిమాలు ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తాయి అంటే.. హరి హర వీరమల్లు కోసం మంగళగిరిలో భారీ సెట్స్ వేస్తున్నారు. అక్కడే షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీని మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఓజీ విషయానికి వస్తే.. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేస్తామని నిర్మాత డీవీవీ దానయ్య(DVV danayya) చెప్పారు. దీనిని బట్టి వీరమల్లు మార్చిలో వస్తే.. ఓజీ మేలో వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ జనవరికి షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఓజీ, వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సరైన టైమ్ చేసి విడుదల చేయనున్నారని సమాచారం. ఏది ఏమైనా నెక్ట్స్ ఇయర్ పవన్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ కావడం మాత్రం ఖాయం. మరి.. ఈ మూడు సినిమాలతో పవర్ స్టార్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.