“డీమాంటీ కాలనీ 2” సినిమాను నిర్మాత సురేష్ రెడ్డి తెలుగు ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యేలా చేశారు – హీరో అరుల్ నిథి

తమిళంతో పాటు తెలుగులో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది హారర్ థ్రిల్లర్ సినిమా “డీమాంటీ కాలనీ 2″(Demonty colony 2). గత నెల 15న తమిళంలో, 23న తెలుగులో ఈ సినిమా రిలీజై ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి(B suresh reddy), బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “డీమాంటీ కాలనీ 2” బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన నేపథ్యంలో తెలుగు ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెప్పిన హీరో అరుల్ నిథి(Hero arulnithi). ఈ సక్సెస్ క్రెడిట్ నిర్మాత సురేష్ రెడ్డికి దక్కుతుందని అన్నారు.

హీరో అరుల్ నిథి మాట్లాడుతూ – డీమాంటీ కాలనీ 2 సినిమాను తెలుగు ఆడియెన్స్ దగ్గరకు ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు బాగా తీసుకెళ్లారు. తెలుగులో మంచి ప్రమోషన్ చేశారు. మా కంటే ఎక్కువగా మా సినిమాను ఆయన బిలీవ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన వల్లే తెలుగులో మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అందుకుంది. తెలుగులో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసేందుకు సురేష్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని అనివార్యమైన పనులతో హైదరాబాద్ రాలేకపోయాం. త్వరలోనే హైదరాబాద్ వచ్చి సక్సెస్ మీట్ నిర్వహిస్తాం. డిమాంటీ కాలనీ 2 పర్పెక్ట్ సీక్వెల్ అనే పేరు వస్తోంది. డీమాంటీ కాలనీ 2తో పాటు 3, 4 సినిమాలు రాబోతున్నాయి. అన్నారు. ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశాను. తెలుగులో మూవీ ఆఫర్స్ ఇప్పటివరకు రాలేదు. నా క్యారెక్టర్ బాగుండి. కథ ఆకట్టుకుంటే తప్పకుండా తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తా. అన్నారు.