ఫ్యామిలీతో న్యూయార్క్ వెకేషన్ లో మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) ఫ్యామిలీతో టూర్ వెళ్లారు. ఆయన కుటుంబంతో న్యూయార్క్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కూతురు సితార(Sithara), కొడుకు గౌతమ్, భార్య నమ్రత మహేశ్ తో పాటు అమెరికా వెళ్లారు. సితారతో మహేశ్ తీసుకున్న ఓ క్యూట్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొత్త డ్రెస్ కొనుక్కున్న సితార మహేశ్ ను పట్టుకుని ఫొటో తీసుకుంది.

ఈ ఫొటోస్ లో మహేశ్ లుక్ అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. తన కొత్త సినిమా కోసం మహేశ్ మేకోవర్ అయ్యారు. లుక్ రివీల్ కాకుండా లాంగ్ షాట్ ఫొటోస్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ నటించనున్న ఎస్ఎస్ఎంబీ 29(SSMB 29) మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.