డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొస్తున్న “విడుదల 2”

పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ “విడుదల 2″(Vidudala 2) రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. డిసెంబర్ 20న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. దర్శకుడు వెట్రిమారన్(vetrimaran) రూపొందించిన “విడుదల 2” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ మూవీ విడుదల 1 సక్సెస్ అయిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

“విడుదల 2” చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్(RS Infotainment) బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. విజయ్ సేతుపతి(Vijay sethupathi), సూరి ప్రధాన పాత్రల్లో నటించగా.. ఇతర కీలక పాత్రలను భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ పోషించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు భాషలకు అతీతంగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో “విడుదల 2” కూడా హిట్ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.