సొంత బ్యానర్ అనౌన్స్ చేసిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూర్వాజ్ సొంత ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేశారు. థింక్ సినిమా పేరుతో బ్యానర్ ప్రారంభించారు. ఈ సంస్థలో ఫస్ట్ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తామని, వచ్చే ఏడాది జూలైలో రిలీజ్ చేస్తామని పూర్వాజ్ తన తాజా ప్రకటనలో తెలిపారు. “శుక్ర”, “మాటరాని మౌనమిది” వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శక నిర్మాత పూర్వాజ్.. ప్రస్తుతం “ఏ మాస్టర్ పీస్” అనే భారీ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ , అషు రెడ్డి, స్నేహ గుప్త కీ రోల్స్ లో నటిస్తున్నారు. “ఏ మాస్టర్ పీస్” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

థింక్ సినిమా బ్యానర్ అనౌన్స్ మెంట్ సందర్భంగా దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ – భౌతిక అవసరాలు తీర్చే మహాత్యం కామధేనువుకు ఉంది. అలాగే మనసును ఆహ్లాదపరిచే సృజన కళామతల్లి సొంతం. ఈ రెండూ కలిపి భౌతికంగా, మానసికంగా ఉల్లాసపరిచే కంటెంట్ తో మా థింక్ సినిమా బ్యానర్ నుంచి మూవీస్ చేయాలని అనుకుంటున్నాం. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ సినిమాల నిర్మాణంలో పరోక్షంగా మేము భాగమయ్యాం. ఇప్పుడు నేరుగా థింక్ సినిమా బ్యానర్ ద్వారా ప్రొడక్షన్ లోకి వస్తున్నాం. మొదటి సినిమాను వచ్చే ఏడాది జూలైలో విడుదలకు తీసుకొస్తాం. అన్నారు.