హిట్ టైటిల్ తో రాబోతున్న రాజశేఖర్

హీరో రాజశేఖర్(Rajashekar) సక్సెస్ సాధించి చాలా కాలమైంది. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఓ కీ రోల్ చేశాడు రాజశేఖర్. అది కూడా పెద్దగా క్లిక్ కాలేదు. స్టైలిష్ విలన్ క్యారెక్టర్స్ కు కూడా సిద్ధమేనని ఇంటర్వ్యూస్ లో చెబుతుంటారు రాజశేఖర్. ఎలాగైనా కెరీర్ ఆపకూడదనేది ఆయన ఆలోచన. ఈ క్రమంలో హీరోగా తన ప్రయత్నాలు ఆపడం లేదు రాజశేఖర్.

రాజశేఖర్ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పవన్ సాధినేని(pavan sadineni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కెరీర్ లో మరచిపోలేని సినిమా మగాడు(Magadu). ఇదే టైటిల్ ను తన కొత్త సినిమాకు పెట్టుకుంటున్నాడట ఈ ఓల్డ్ యాంగ్రీ యంగ్ మ్యాన్. ఈ మూవీ డీటెయిల్స్ అనౌన్స్ చేసేందుకు టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.