ప్రభాస్ ఫ్లాప్ ఫ్రూఫ్ స్టార్ – డైరెక్టర్ ఓం రౌత్

ఆదిపురుష్(Adipurush) సినిమా దర్శకుడు ఓం రౌత్(Om raut) ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రభాస్(Prabhas) గురించి, ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడిన మాటల వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫ్లాప్స్ ప్రభాస్ ను ఇంపాక్ట్ చేయలేవని, ఆయన ఫ్లాప్ ఫ్రూఫ్ స్టార్ అని ఓం రౌత్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆదిపురుష్ కలెక్షన్స్ పరంగా చూస్తే హిట్ సినిమానే అని ఆయన అన్నారు.

ఓం రౌత్ మాట్లాడుతూ – బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాగే ప్రభాస్ కూడా ఫ్లాప్ ప్రూ‌ఫ్ స్టార్. ఆయన స్టార్ డమ్ ను ఫ్లాప్ సినిమాలు ఏమీ చేయలేవు. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా ఫ్లాప్ అయితే ప్రభాస్ అభిమానులు తగ్గిపోరు. ఆదిపురుష్ సినిమా మీద కొందరు చేసిన అనవసరపు నెగిటివ్ కామెంట్స్ వదిలేస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మా దృష్టిలో ఆదిపురుష్ సక్సెస్ ఫుల్ సినిమానే. అని అన్నారు.