గెట్ రెడీ ఫర్ “గేమ్ ఛేంజర్” అప్డేట్

రామ్ చరణ్(Ramcharan) హీరోగా దర్శకుడు శంకర్(Shankar) రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్(Gamechanger) నుంచి అదిరే అప్డేట్ రాబోతోందని తెలుస్తోంది. ఈ వినాయక చవితి రోజున గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఉంటుందట. అది గ్లింప్స్ లేదా టీజరా అనేది క్లారిటీ రావాల్సిఉంది. దసరా, దీపావళి ముందు గణేష్ చతుర్ది పెద్ద పండుగ.

సో వినాయక చవితి పండుగ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని గేమ్ ఛేంజర్ మేకర్స్ భావిస్తున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా సినిమా రిలీజ్ ఉంటుందని ఆ మధ్య నిర్మాత దిల్ రాజు(Dil raju) ప్రకటించారు. అయితే మళ్లీ శంకర్ రీషూట్స్ చెప్పాడని, రిలీజ్ సందేహమేననే మాటలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో వినాయక చవితి రోజున గేమ్ ఛేంజర్ నుంచి వచ్చే అప్డేట్ కీలకం కానుంది. అది టీజర్ అయినా, రిలీజ్ డేట్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయినా బిగ్ న్యూస్ కానుంది.