సుకుమార్ రైటింగ్స్ లో కల్యాణ్ రామ్ సినిమా

“బింబిసార”(Bimbisara) సక్సెస్ తర్వాత యాక్షన్ మూవీస్ కే ప్రాధాన్యత ఇస్తున్నాడు కల్యాణ్ రామ్(Kalyan ram). ఆ మధ్య డెవిల్ వంటి బిగ్ అటెంప్ట్ చేశాడు..ఇప్పుడు ఎన్ కేఆర్ 22 మూవీలోనూ యాక్షన్ డ్రామా కథలోనే నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు మెరుపు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

హీరోగా నిర్మాతగా బిజీగా ఉన్న కల్యాణ్ రామ్ రీసెంట్ గా మరో కొత్త మూవీ ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ సుకుమార్(Sukumar) శిష్యుడు సూర్యప్రతాప్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇటీవల సూర్యప్రతాప్ చెప్పిన స్టోరీకి కళ్యాణ్ రామ్ కు నచ్చడంతో మూవీ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.