వైష్ణవ్ తేజ్ నెక్ట్ డైరెక్టర్ ఇతనే

తన ఇమేజ్ కు భిన్నమైన సినిమాలు చేసి సక్సెస్ కు దూరమయ్యారు వైష్ణవ్ తేజ్(Vaishanv tej). ఉప్పెన తర్వాత వచ్చిన ఇన్నోసెంట్ లవర్ ఇమేజ్ ను కాదని, మాస్ యాక్షన్ మూవీస్ చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో కొండపొలం, ఆదికేశవ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రూపొందించిన దర్శకుడు కృష్ణ చైతన్య(krishna chaitanya)తో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబో మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తోనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించాడు. వైష్ణవ్ తేజ్ మూవీ కూడా అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ఉండనుందట.