Bcineet ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న “కన్యక”

Bcineet సమర్పణలో శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్ పై కేవీ అమర్, సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్రరావు నిర్మించిన చిత్రం కన్యక. ఈ చిత్రానికి రాఘవేంద్ర.టి దర్శకత్వం వహించారు. శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి , పీవీఎల్ వరప్రసాదరావు, సర్కార్, ఫణిసూరి కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఈ సినిమా ఆడియో రిలీజైంది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి కన్యక సినిమా వచ్చేసింది. Bcineet OTT లో కన్యక సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 49 రూపాయలు రెంట్ పే చేసి సినిమాను చూడొచ్చు అని నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర.టి మాట్లాడుతూ – మా సినిమా ట్రైలర్ ను నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీ చదలవాడ అరవింద బాబు రిలీజ్ చేశారు. అలాగే వీడియో సాంగ్ ను ఏపీ బులియన్ మర్చంట్ అసోసిషన్ శ్రీ కపిలవాయి విజయ్ కుమార్, చిత్రంలోని రెండవపాట సుబ్బరాయ గుప్త గారు రిలీజ్ చేశారు. మూవీ ఫస్ట్ టికెట్ లాంఛ్ కార్యక్రమం శ్రీశైలం ఆ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి సన్నిధిలో వాసవి సత్రంలో వాసని సత్ర సముదాయాల అధ్యకులు శ్రీ దేవకి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా చీతీరాల పెద్దన్న, ఆర్య వైశ్య ప్రముఖల సమక్షంలో జరిగింది. Bcineet ద్వార వినాయక చవితికి అన్ని ఓటీటీల్లో కన్యక సినిమా రీలీజ్ చేస్తున్నాం. అని అన్నారు.